రాజంపేట వరదల్లో 12 మంది మృతి.. కొనసాగుతున్న గాలింపు

Heavy Rain: భారీ వర్షాలు వరదలతో కడప జిల్లాలో భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Update: 2021-11-19 13:19 GMT

రాజంపేట వరదల్లో 12 మంది మృతి.. కొనసాగుతున్న గాలింపు

Heavy Rain: భారీ వర్షాలు వరదలతో కడప జిల్లాలో భీతావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదయం నందలూరు దగ్గర ఆర్టీసీ బస్సులు వరదనీటిలో చిక్కుకున్న ఘటనలో 12మంది మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 50మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో గండ్లూరులో 7, రాయవరంలో 3, మండపల్లిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక ఈ ప్రమాదంలో చిక్కుకున్న పలువురిని రెస్క్యూ టీమ్స్ రక్షించగా గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరోవైపు వాగులో చిక్కుకున్న బస్సు ప్రమాదంపై సీఎం జగన్ స్పందించారు. గల్లంతయిన వారికోసం గాలింపు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇప్పటికే సహాయక చర్యల కోసం హెలికాప్టర్లు పంపిన సీఎం మరణించిన వారికి పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గల్లంతయిన వారి విషయంలో రేపటికి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుండగా ఎక్స్‌గ్రేషియాను మరింత పెంచేందుకు కృషి చేస్తామని రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి స్పష్టం చేశారు.

Tags:    

Similar News