Tirumala: తిరుమలలో కుండపోత వర్షం

*రెండు ఘాట్ రోడ్డుల్లో టూ వీలర్స్‌ తాత్కాలికంగా నిలిపివేత *శ్రీవారి ఆలయ ప్రాంగణం, తిరుమాడ వీధులు, తిరుమల రోడ్లన్నీ జలమయం

Update: 2021-11-28 07:58 GMT

తిరుమలలో కుండపోత వర్షం

Tirumala: అండమాన్‌లో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుండి ఈదురు గాలులతో కూడిన ఎడతెరపి‌ లేకుండా వర్షం పడడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి ఆలయ ప్రాంగణం, తిరుమాడ వీధులు, లడ్డు కేంద్రం, తిరుమల రోడ్లన్ని జలమయమయ్యాయి. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు రెండు ఘాట్ రోడ్డుల్లో ద్విచక్ర వాహనదారుల అనుమతిని తాత్కాలికంగా నిలిపివేశారు.

ఘాట్ రోడ్డులో వాహనాల్లో ప్రయాణించే యాత్రికులను విజిలెన్స్ సిబ్బంది అప్రమత్తం చేస్తోంది. అంతే కాకుండా తిరుమలలో పాపవినాశనం, ఆకాశ గంగా, జపాలి, ధర్మగిరి, శ్రీవారి పాదాల వంటి యాత్ర ప్రదేశాలకు భక్తుల అనుమతిని టీటీడీ నిలిపివేసింది.

Tags:    

Similar News