Vizag: విశాఖలో పోలీసుల ఆంక్షలు.. పలువురు టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
Vizag: రుషికొండ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసుల మోహరింపు
Vizag: విశాఖలో పోలీసుల ఆంక్షలు.. పలువురు టీడీపీ నేతల హౌస్ అరెస్ట్
Vizag: విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉత్తరాంధ్ర సమస్యలపై ఐదు రోజులపాటు టీడీపీ పోరు పేరుతో ఆందోళనలకు పార్టీ నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా.. ఇవాళ రుషికొండలో తవ్వకాలు, అక్రమ కట్టడాలకు నిరసనగా ఆందోళనలకు సిద్ధమయ్యారు. అయితే.. టీడీపీ నిరసనకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాల వద్ద టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. రుషికొండ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.