అనంతపురం జిల్లా నడిమివంక దిగువ ప్రాంతాలకు పోటెత్తిన వరద
Heavy Floods: పలు, కాలనీలు, ఇళ్లలోకి భారీగా చేరుతున్నవరద నీరు
Heavy Floods: అనంతపురం జిల్లా నడిమివంక దిగువ ప్రాంతాలకు పోటెత్తిన వరద
Heavy Floods: అనంతపురం జిల్లాలో వరదలు ప్రమాదకరస్థాయి చేరుకున్నాయి. వీధులు, కానీలు, జనావాసాలను ముంచెత్తుతుతున్నాయి. ముఖ్యంగా అనంతపురం నడిమివంక దిగువన ఉన్న కాలనీల్లో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఎగువనున్న కాటిగానికల్వ చెరువుకు అధికారులు గండి కొట్టడంతో నీటి ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది.
రంగస్వామినగర్, రజాకనగర్, అరో రోడ్డు శివారు కాలనీల్లో క్రేన్ల సాయంతో నీటిలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న అధికారులు..లోత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసిన అక్కడి ప్రజలను పునరావాస శిభిరాలను తరలిస్తున్నారు.