శ్రీశైలానికి భారీగా వరద నీరు

Update: 2019-09-08 02:34 GMT

ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ మళ్లీ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల నుంచి 2లక్షల 15వేల 450 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతోంది. మొత్తం అవుట్ ఫ్లో లక్ష 1వేయి 208 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.

శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా... ప్రస్తుత సామర్థ్యం 881.60 అడుగులుగా ఉంది. డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 197 టీఎంసీలు ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మేజర్ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 2400 క్యూసెక్కులు, మల్యాల హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ ఉత్పత్తి అనంతరం 881 క్యూసెక్కులు విడుదల అవుతున్నాయి. 

Tags:    

Similar News