విశాఖ బీచ్ రోడ్డులోని పలుచోట్ల భారీగా కోతకు గురౌతున్న తీరం

* ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకూ 35 కిలో మీటర్లు పొడవు * ప్రమాదంలో బీచ్ రోడ్డును ఆనుకుని 43 తీర గ్రామాలు

Update: 2021-11-14 07:49 GMT

విశాఖ బీచ్ రోడ్డులోని పలుచోట్ల భారీగా కోతకు గురౌతున్న తీరం(ఫైల్ ఫోటో)

Visakha Beach Road: విశాఖ నగరం అందానికి, పర్యాటక అభివృద్ధికి బీచ్ రోడ్డే ఆయువుపట్టు. ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకూ సుమారు 35 కిలోమీటర్లు పొడవునా విస్తరించిన బీచ్ రోడ్డును ఆనుకుని 43 తీరగ్రామాలు ఊన్నాయి. సుమారు రెండు లక్షల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. ఇంతటి విలువైన బీచ్ రోడ్డులోని తీరం పలుచోట్ల భారీగా కోతకు గురౌతోంది.

తీవ్ర తుఫాన్లు ఏర్పడినప్పుడు గాలుల తీవ్రత గరిష్టంగా 150 నుంచి 200 కిలోమీటర్ల వరకూ వుంటోంది. వీటి ప్రభావంతో చొచ్చుకు వచ్చే అలలు ప్రభావం అధికంగా ఉంటోంది. 2014లో వచ్చిన హుదూధ్ తుఫాన్ తీరానికి రక్షణ కవచంలా వుండే ఎత్తైన ఇసుక దిబ్బలను, మడ అడవులను నశింపజేసింది. ఇప్పుడు వీటి జాడ మచ్చుకైనా కనిపించడం లేదు.

గడచిన 50 ఏళ్ళ కాలంలో తీరప్రాంతం కోత అధికంగా వుంటోందని నిపుణుల అధ్యయనంలో తేలింది. ఒకప్పుడు రామక్ర్రష్ణ బీచ్, కోస్టల్ బ్యాటరీ ప్రాంతాల్లో సుమారు 500 మీటర్ల తీరప్రాంతం వుండేదని అప్పటి ఫోటోలు నిర్ధారిస్తున్నాయి.

కాలక్రమంలో తీరం తగ్గిపోగా అలలు ముందుకు చొచ్చుకు వచ్చేస్తున్నాయి. పెద మంగమారిపేట తీరం దాదాపు స్వరూపాన్ని కోల్పోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులు వలనే ప్రకృతి ప్రకోపిస్తోందని, ప్రభుత్వాలు దృష్టిసారించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Tags:    

Similar News