అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది : ఆళ్ల నాని

ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఇప్పటి వరకు 227 కేసులు నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఆస్పత్రి నుంచి ఇప్పటి వరకు 70 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు.

Update: 2020-12-06 06:34 GMT

 ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఆళ్ల నాని పరామర్శించారు. ఇప్పటి వరకు 227 కేసులు నమోదయినట్లు ఆయన వెల్లడించారు. ఆస్పత్రి నుంచి ఇప్పటి వరకు 70 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. కేసులు వస్తున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బాధితులకు అన్ని పరీక్షలు చేశామని.. అస్వస్థతకు గురైన వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందన్నారు మంత్రి ఆళ్ల నాని.

ఏలూరులోని ఘటనా ప్రాంతాలలో ఇంటింటికి సర్వే చేసి.. వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో మెడికల్‌ క్యాంప్‌లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు, బాధిత కుటుంబాలు ఆందోళన చెందవద్దని.. పరిస్థితి కారణాలపై అన్వేషిస్తున్నామన్నారు ఆళ్ల నాని. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు చెబుతున్నారన్న మంత్రి.. పరిస్థితిని స్వయంగా సీఎం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

Tags:    

Similar News