Gun Misfire: తుపాకీ మిస్ ఫైర్ హెడ్ కానిస్టేబుల్ మృతి
Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు.
Gun Misfire:(File Image)
Gun Misfire: తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం పాలయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే... తిరుపతి ప్రత్యేక జైలులో ఏఆర్ బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ లక్ష్మీనారాయణరెడ్డి (47) గత ఏడాది నుంచి సబ్ జైలు వద్ద గార్డుగా పనిచేస్తున్నాడు. లక్ష్మీనారాయణరెడ్డి ఎప్పటిలానే శనివారం సాయంత్రం 6.00 గంటలకు డ్యూటీ ముగించుకున్నాడు. విధులు పూర్తికాగానే.. ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలో బట్టలు మార్చుకునే సమయంలో తుపాకీ (303 రైఫిల్) పక్కన పెడుతుండగా మిస్ ఫైర్ అయ్యింది. బుల్లెట్ గుండెలోకి దూసుకు వెళ్లడంతో లక్ష్మీనారాయణరెడ్డి అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనపై అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.