Ration Cards Status: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా? స్టేటస్ తెలుసుకోండిలా..!!

Update: 2025-05-16 05:13 GMT

Ration Cards Status: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా? స్టేటస్ తెలుసుకోండిలా..!!

Ration Cards Status: కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారా? అయితే మీ స్టేటస్ ఏంటో తెలుసుకోవాలంటే ఎలాగో చూద్దాం.

ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న తర్వాత..ఈకేవైసీ, వీఆర్వో, తహసీల్దార్ ఇలా మూడు చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. ఆ దశల పూర్తికి 21 రోజుల వరకు సమయం పడుతుంది. ఈ క్రమంలో దరఖాస్తుల పురోగతిని ఆన్ లైన్ లో చూసుకునే వెసులుబాటును కూడా దరఖాస్తుదారులకు కూటమి సర్కార్ కల్పించింది.

https://vswsonline.ap.gov.in/వెబ్ సైట్లో లాగిన్ అవుతే..ఏపీ సేవా అధికారిక పోర్టల్ వస్తుంది. అందులో కుడి వైపున పైన సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే సెర్చ్ కాలమ్ ఉంటుంది. అందులో రేషన్ కార్డు దరఖాస్తు సమయంలో వచ్చిన సంఖ్య నమోదు చేయాలి. ఆ తర్వాత ఓ కోడ్ వస్తుంది. ఆ వివరాలు అందులో పొందుపరుస్తే రేషన్ కార్డు దరఖాస్తు ఏ అధికారి దగ్గర ఉందో తెలిసిపోతుంది. ఈ ప్రక్రియ ఎన్ని రోజుల్లోపు పూర్తి అవుతుందనే వివరాలు అందులో కనిపిస్తాయి.

Tags:    

Similar News