ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవి రెడ్డి రాజీనామా

Update: 2025-02-24 14:17 GMT

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవి రెడ్డి రాజీనామా

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు జీవీ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించారు. అంతేకాదు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అంతేకాదు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి హోదా నుంచి తప్పుకుంటున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గా ఆయన వెయ్యి మందిని తొలగించారు. అయితే వారిని ఇంతవరకు రిలీవ్ చేయలేదు. దీనిపై ఫైబర్ నెట్ ఎండీపై జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ సమయంలో అధికారులపై ముఖ్యంగా ఐఎఎస్ అధికారులపై ఆయన చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.ఈ వ్యాఖ్యలపై జీవీరెడ్డిపై ఐఎఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు.

అసలు జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు ఏంటి?

ఏపీ ఫైబర్ నెట్ సంస్థను కనుమరుగు చేసేలా అధికారులు కుట్ర పన్నారనే అనుమానాన్ని జీవీ రెడ్డి వ్యక్తం చేశారు. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ ఆ సంస్థను చంపేయాలనుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.ఫైబర్ నెట్ లో ఉన్నత ఉద్యోగులు రాజద్రొహనికి పాల్పడుతున్నారని ఆయన అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చేరిన ఉద్యోగుల తొలగింపు విషయంలో ఎండీ దినేష్ వ్యవహారశైలిపై ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. రూ. 377 కోట్లు జరిమానా విధించినా సమాచారం ఇవ్వలేదన్నారు. తొలగించిన వెయ్యి మంది ఉద్యోగులకు ఇంకా జీతాలు చెల్లిస్తున్నారని ఆయన అన్నారు.

Tags:    

Similar News