Gulab Cyclone: పంటలపై ప్రభావం చూపిన గులాబ్ తుఫాన్

Gulab Cyclone: శ్రీకాకుళం జిల్లాపై భారీ ఎఫెక్ట్ * వేల ఎకరాల్లో వరి పంట ముంపు

Update: 2021-09-29 03:57 GMT

పంటపై గులాబీ సైక్లోన్ ప్రభావం (ఫైల్ ఇమేజ్)

Gulab Cyclone: శ్రీకాకుళంపై గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ భారీగా పడింది. వేలాది ఎకరాలు ముంపునకు గురయ్యాయి. తుపాను కారణంగా నదులు, వాగులు, వంకలు పోటెత్తాయి. దీంతో సుమారు 50 వేల హెక్టార్ల వరకూ వరి పొలాలు నీట మునిగాయి. అరటి, మొక్క జొన్న పంటలు కూడా నేలకొరిగాయి. శ్రీకాకుళం నుంచి పలాస వరకు వరి నీట మునగడం, అరటి, మొక్కజొన్న పంటలు నేలకొరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

50 వేల హెక్టార్లలో, 14వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్టు జిల్లా వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వర్షం తగ్గితే పూర్తిస్థాయిలో నష్టాన్ని నిర్ధారిస్తామని ఆ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ తుఫాను వల్ల పాలకొండ, వీరఘట్టాం, లావేరు, రణస్థలం, గార, శ్రీకాకుళం రూరల్, ఆమదాలవలస, సరుబుజ్జిలి, వంగర, రేగిడి, సంతకవిటి, రాజాం, పొందూరు మండలాల్లో వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గులాబ్ తుఫాన్ తీవ్ర నష్టం మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదని చెప్తున్నారు.

తమ గ్రామంలో సుమారు 150 ఎకరాలు నీట మునిగాయని, తమ పరిస్థితి ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికారులు క్షేత్ర స్ఠాయిలో పర్యటించి ప్రతీ గ్రామాన్ని సందర్శిస్తేనే ఎంత నష్టం జరిగిందనే క్షేత్రస్థాయిలో తెలుసుకోవచ్చని చెప్తున్నారు.

Tags:    

Similar News