AP High Court: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

AP High Court: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది.

Update: 2021-05-03 08:54 GMT
ఏబీ వెంకటేశ్వర్ రావు 

AP High Court: ఏపీ ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట లభించింది. రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో వెంకటేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో తనను అరెస్టు చేయకుండా ఆపాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీని పై విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆయ‌న‌పై ఉన్న‌ ఆరోప‌ణ‌ల‌పై కమిషనరాఫ్ ఎంక్వైరీస్ ఏబీ వెంకటేశ్వరరావుపై ఇటీవ‌లే 14 రోజుల విచార‌ణ పూర్తి చేసింది.

ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఏడాదికిపైగా సస్పెన్షన్‌ను పొడిగించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం విచారణ కోర్టు విచారణ జరపగా.. ఏబీ వెంకటేశ్వరరావు తరఫున ఆదినారాయణరావు, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది చందర్‌ ఉదయ్‌సింగ్ వాదనలు వినిపించారు.

ఏబీ విషయంలో సస్పెన్షన్‌ ఒక్కటే మార్గమా.. ఆయనకు మరో చోట పోస్టింగ్‌ ఇవ్వొచ్చు కదా అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఒక ఆరోపణపై సస్పెన్షన్‌ విధించడంలో అర్థమేంటని.. ఆరోపణలు నిగ్గుతేల్చాక చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడింది. ఆరోపణలపై దర్యాప్తు పూర్తిచేసేందుకు ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ ఆరునెలల గడువు కోరారు. ఒక సీనియర్‌ అధికారిని సస్పెండ్‌ చేసి దర్యాప్తు పూర్తి చేయకుండా ఎన్నాళ్లు గడువు తీసుకుంటారని.. రోజువారీ దర్యాప్తు చేపట్టి ఎందుకు వెంటనే పూర్తిచేయలేరని కోర్టు ప్రశ్నించింది.

Tags:    

Similar News