శ్రీప్రకాష్ లో ఘనంగా ప్రారంభమైన రిమ్ జిమ్

పట్టణంలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నందు 15 వ రిమ్ జిమ్ 2019 ఘనంగా ప్రారంభమైనది.

Update: 2019-12-13 06:43 GMT
సి.హెచ్.విజయ్ ప్రకాష్

పాయకరావుపేట: పట్టణంలోని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల నందు 15 వ రిమ్ జిమ్ 2019  ఘనంగా ప్రారంభమైనది. ఈ కార్యక్రమాన్ని శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల సంయుక్త కార్యదర్శి సి.హెచ్.విజయ్ ప్రకాష్, ఉపాధ్యాయ దినోత్సవం నాడు ప్రతిభ కనబరిచిన విద్యార్థులు బాల అతిధులుగా ఎన్ అక్షయ రఘురామ్, బి.యమున, ఎల్వీఎస్ మనస్విని, సి.హెచ్ సంధ్యాదేవి, తేజస్విని నంద, జి.ఉమా ప్రభాత్ రెడ్డిలు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రారంభోత్సవ కార్యక్రమం నందు విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈ నెల 14 న ముగుస్తుందన్నారు. ఈ 15 వ రిమ్ జిమ్ కార్యక్రమం విద్యార్థుల ప్రతిభ పాటవాలను వెలికితీసేలా రూపొందించబడినది అని, విద్యార్థులు అన్ని రంగాల నందు ప్రతిభ కనబరచడానికి, ఆల్ రౌండర్ లుగా అభివృద్ధి చెందడానికి ఈ పోటీలు సహకరిస్తాయని అన్నారు.

Tags:    

Similar News