ఈనెల 22న గాయత్రి గోశాలను సందర్శించనున్న గవర్నర్
ఈ నెల 22న కర్నూలులో రాష్ట్ర గవర్నర్ పర్యటన సందర్బంగా నగర శివారులోని డోన్ రోడ్డు లోగల గాయత్రి గోశాలను రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సందర్శనున్నారు.
కర్నూలు: ఈ నెల 22న కర్నూలులో రాష్ట్ర గవర్నర్ పర్యటన సందర్బంగా నగర శివారులోని డోన్ రోడ్డు లోగల గాయత్రి గోశాలను రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సందర్శనున్నారు. ఈ మేరకు గాయత్రి గోసేవ సమితి సభ్యులు విజయవాడలో గవర్నర్ ని కలిసి ఆహ్వానించారు. 22వ తేదీ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ గోశాలను రానున్నారని.
గవర్నర్ ను కలిసిన గాయత్రి గోశాల గోసేవ సమితి సభ్యులు గోశాల గురించి వివరించారు. గోశాలలో 550 కి పైన గోవులు ఉన్నట్లు తెలిపారు. గోశాలను రావాలని ఆహ్వానించటంతో గవర్నర్ అంగీకరించినట్లు గోసేవ సమితి సభ్యులు తెలిపారు. గవర్నర్ ను కలిసిన వారిలో గాయత్రి గోసేవ సమితి సెక్రటరీ ఇల్లూరి లక్ష్మయ్య , గౌరవ అధ్యక్షులు విజయ్ కుమార్, సభ్యులు శ్రీధర్, శేషఫణి, తదితరులు ఉన్నారు.