Governor S Abdul Nazeer: 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం

Governor S Abdul Nazeer: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు.

Update: 2025-02-24 07:14 GMT

Governor S Abdul Nazeer: 2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తాం

Governor S Abdul Nazeer: ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందన్నారు గవర్నర్ అబ్ధుల్ నజీర్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు. గత ఐదేళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని ఈ సందర్భంగా గవర్నర్ తెలిపారు. సూపర్ సిక్స్ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని...అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్ సీ దస్త్రంపై సంతకం చేశారని గవర్నర్ అబ్ధుల్ నజీర్ తెలిపారు. 

2047 నాటికి స్వర్ణాంధ్ర కలను సాకారం చేస్తామని ఏపీ గవర్నర్‌ అబ్ధుల్ నజీర్ అన్నారు. బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలిరోజు ఉభయసభలనుద్దేశించిన గవర్నర్ ప్రసంగించారు. ప్రతినెలా 1వ తేదీనే ఇంటికి వెళ్లి ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని తన ప్రసంగంలో గవర్నర్‌ తెలిపారు.

విద్య, వైద్యం, మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బీసీవర్గాలు కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని...స్థానికసంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గవర్నర్‌ అబ్ధుల్ నజీర్ తెలిపారు.

Tags:    

Similar News