Government to purchase tobacco: పొగాకు వ్యాపారం లోకి ఏపీ ప్రభుత్వం!

Government to purchase tobacco: పొగాకు వ్యాపారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది.

Update: 2020-07-01 04:30 GMT

Government to purchase tobacco: పొగాకు వ్యాపారం చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. వైన్ షాపుల మాదిరిగానే తామే ప్రత్యేక అధికారులు, సిబ్బందిని నియమించి కొనుగోలు చే సేందుకు నిర్ణయించుకుంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, ఒంగోలు తదితర జిల్లాల్లో రైతులు ఈ పొగాకును పండిస్తున్నారు. సిగెరెట్ కు వాడే దీనిని సుమారుగా మూడు దశాబ్దాలుగా రైతులు పండిస్తూ వస్తున్నారు. ఈ సాగు ప్రారంభంలో మంచి ధర ఇచ్చిన కంపెనీలు క్రమేపీ ఏటా తగ్గించుకుంటూ రావడంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తామే స్వయంగా కొనుగోళ్లు చేసి రైతుల్ని ఆదుకోవాలని తన వంతు ప్రయత్నం ప్రారంభించింది.

జగన్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వమే పొగాకు కొనుగోళ్లు చేపట్టేందుకు సిద్ధమౌతోంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. బుధవారం నుంచి రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకే రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటి నుంచి మార్క్‌ఫెడ్‌ ద్వారా పొగాకు కొనుగోళ్లను ప్రభుత్వమే చేపడుతుందని ఆయన అన్నారు.

ఈ నేపథ్యంలో ఒంగోలులోని 1, 2కేంద్రాల ద్వారా పొగాకు కొనుగోళ్లు ప్రారంభిస్తామని కన్నబాబు చెప్పుకొచ్చారు. ఆ తరువాత అన్ని ప్రాంతాల్లో కొనుగోళ్లు చేపడుతామని ఆయన అన్నారు. ఎఫ్‌3, ఎఫ్‌4, ఎఫ్‌5, ఎఫ్‌8, ఎఫ్‌9 గ్రేడు పొగాకును తాము కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. పొగాకు బోర్డు చెప్పిన దానికంటే అధిక మొత్తానికి కొనుగోళ్లు చేస్తామని కన్నబాబు వివరించారు.


Tags:    

Similar News