ప్రజావేదిక నిర్మాణంలో అవినీతిని బయటపెట్టిన ప్రభుత్వం

Update: 2019-06-22 15:33 GMT

ప్రజావేదిక నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి జరిగినట్లు ప్రభుత్వం తేల్చింది. సీఆర్డీఏ అనుమతి లేకుండానే నిర్మాణాలు జరిగినట్టు నిర్ధారించిన అధికారులు.... మంత్రి బొత్స సత్యనారాయణకు డిటైల్ట్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. 5కోట్ల రూపాయల అంచనాలను దాదాపు 9కోట్లకు పెంచి నిర్మాణం చేపట్టారని తేల్చారు. ఎలాంటి అనుమతి లేకుండా కృష్ణానది కరకట్టపై ప్రజావేదిక నిర్మాణం చేపట్టడమే కాకుండా, ఆనాటి మంత్రి నారాయణ నోటి మాటతో టెండర్లు లేకుండానే కాంట్రాక్టు ఇచ్చినట్లు మంత్రి బొత్సకు అధికారులు నివేదిక ఇచ్చారు. 

Tags:    

Similar News