అంగన్‌వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వ చర్చలు విఫలం

Andhra News: జీతాల పెంపు సాధ్యం కాదని తేల్చిచెప్పిన ఏపీ ప్రభుత్వం

Update: 2023-12-27 04:04 GMT

అంగన్‌వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వ చర్చలు విఫలం

Andhra News: సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చల్లో అంగన్వాడీలకు నిరాశ ఎదురైంది. అంగన్వాడీలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి సమ్మెను ఉదృతం చేయనున్నారు. జీతాల పెంపు సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. అదే సందర్భంలో సమ్మె విరమించాలని అంగన్వాడీలను కోరడంతో వారు ససేమిరా అంటూ ప్రకటన చేశారు. ఇవాళ్టి నుంచి యథావిధిగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతుందని తెలిపారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించనున్నారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని.. లేదంటే జనవరి 3న కలెక్టరేట్లను ముట్టడిస్తామంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

Tags:    

Similar News