ఎయిడెడ్ విద్యార్థులకు కూడా ప్రభుత్వ సహాయం అందాలి: ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు

ఎయిడెడ్ విద్యాసంస్థలో చదివే పేద విద్యార్థులకు కూడా ప్రభుత్వ సహాయం అందాలని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

Update: 2020-05-27 17:31 GMT
Yilla Venkateswara rao

ఎయిడెడ్ విద్యాసంస్థలో చదివే పేద విద్యార్థులకు కూడా ప్రభుత్వ సహాయం అందాలని ప్రముఖ విద్యావేత్త, ఎమ్మెల్సీ ఇళ్ళ వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. తొలియేడు- జగనన్నతోడు కార్యక్రమంలో భాగంగా బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో విద్యారంగం పై రాబోయే నాలుగు సంవత్సరాలు తీసుకోవలసిన కార్యక్రమాల పై ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్తో పాటు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి, ప్రోపెసర్స్, విద్యావేత్తలతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మండలి సభ్యులు, విద్యావేత్త ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పేద విద్యార్థులకు ప్రభుత్వం అందించే సహాయం అందాలన్నారు. ఆధార్ కార్డులో అభ్యంతరాలు ఉన్నాయని నేపంతో అమ్మ ఒడి లాంటి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందడం లేదని వీటిని సరిచేయాలన్నారు. నాడు- నేడు ద్వారా చేపట్టే పనులు పూర్తి నాణ్యతతో ప్రమాణాలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ఎమ్ ఇఓ, డిప్యూటీ డిఇఓ, డిఇఓ లు అకాడిమిక్ పైనే పూర్తిస్థాయిలో దృష్టి సాదిస్తే మంచి ఫలితాలు వస్తాయని ఇళ్ల వెంకటేశ్వరరావు తెలిపారు.


Tags:    

Similar News