Guntur: ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు: కలెక్టర్

ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.

Update: 2020-01-27 02:57 GMT

గుంటూరు: ప్రభుత్వం సచివాలయాల ద్వారా ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను తెచ్చిందని జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక భారత్ పేటలోని 140వ వార్డు సచివాలయంను జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ తో కలసి సందర్శించి, అధికార్లకు, సిబ్బందికి పలు సూచన లు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయ పరిధి, సిబ్బంది వివరాలను నగర పాలక సంస్థ కమీషనరు చల్లా అనురాధను అడిగి తెలుసుకొన్నారు.

అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 872 గ్రామ సచివాలయాలు, 462 వార్డు సచివాలయాలు ఆదివారం నుండి పూర్తి స్తాయిలో ప్రజలకు అందు బాటులోకి వస్తున్నాయన్నారు. పాలన వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి ఫలాలు ప్రజలకు నేరుగా, వేగంగా అందుతాయని అన్నారు. సచివాలయాల ద్వారా అత్యధిక సేవలు కేవలం 72 గంటల లోపే అందుతాయని, మరి కొన్ని ఇంకా తక్కువ సమయలోనే పూర్తి అవుతాయని అన్నారు. ప్రభు త్వ పధకాల సమగ్ర సమాచారం సచివాలయంలో అందుబాటులో ఉండాలని, సిబ్బంది ప్రతి ఒక్కరూ ఐడి కార్డు ధరించాలని ఆదేశించారు.

గుంటూరు పశ్చిమ శాసన సభ్యులు మద్దాల గిరిధర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంతో ముందు చూపుతో సచివాలయాలను ఏర్పాటు చేసారని, నిర్దేశిత సమయంలో ప్రజ లకు వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని హర్షం వ్యక్తం చేసారు. అవినీతి లేని పాలన ద్వార ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా అనురాధ, ఆర్.డి.ఓ.భాస్కర రెడ్డి, తహశీదార్లు మోహనరావు, శ్రీకాంత్, నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ కమీషనర్ డి.శ్రీనివాసరావు, ఆర్.ఓ ప్రసాద్, డి.ఈ.ఈ. శ్రీనివాసరెడ్డి, ఏఈ అనూష పాల్గొన్నారు. 

Tags:    

Similar News