Andhra Pradesh: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల చర్చలు

Andhra Pradesh: సెంట్రల్‌ పే కమిషన్‌ ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి..

Update: 2021-12-14 11:02 GMT

ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల చర్చలు(ఫైల్-ఫోటో)

Andhra Pradesh: ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ సలహాదారు సజ్జల చర్చలు జరుపుతున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో జరుగుతున్న ఈ చర్చల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకట్రామిరెడ్డితో పాటు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి సంఘాల నేతలు పాల్గొన్నారు. పీఆర్సీపై సీఎస్‌ ఇచ్చిన నివేదికపై ఉద్యోగ సంఘాలతో సజ్జల చర్చిస్తున్నారు. సీఎస్‌ ఇచ్చిన నివేదిక తమకు ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాలు సజ్జలకు తెలిపారు.

సెంట్రల్‌ పే కమిషన్‌ ప్రకారం 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఆమోదయోగ్యం కాదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఇదిలా ఉంటే అధికారుల కమిటీ రికమెండ్‌ చేసిన మొత్తాన్ని మించి ప్రభుత్వం భరించే స్థితిలో లేదని సజ్జల అన్నారు. ఐఆర్‌ తెలంగాణలో ఇవ్వలేదు రికమెండేషన్స్‌ అమలు చేయకుండా వాయిదా వేస్తున్నారని ఆయన చెప్పారు. ఉద్యోగ సంఘాలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరిస్తామని, ఉద్యోగులు సీఎంను కలిసే ముందు మార్గాన్ని సుగమం చేసే పని తాను చేస్తున్నానని అన్నారు సజ్జల.

Tags:    

Similar News