ఏపీలో అక్రమ మైనింగ్ జరగడం లేదు- గోపాలకృష్ణ ద్వివేది

విశాఖ జిల్లాలో 6 లేటరైట్ లీజులు ఉన్నాయి..6 లేటరైట్ లీజుల్లో 5 పనిచేయడం లేదు- గోపాలకృష్ణ ద్వివేది

Update: 2021-07-10 15:48 GMT

గోపాలకృష్ణ ద్వివేది (ఫైల్ ఫోటో)

Andhra Pradesh: ఏపీలో అక్రమ మైనింగ్ జరగడం లేదని గనులశాఖ ముఖ్యకార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది అన్నారు. కావాలనే కొంతమంది అసత్య ప్రచరాలు చేస్తున్నారని వెల్లడించారు. విశాఖ జిల్లా నాతవరం మండలంలో 6 లేటరైట్ లీజులు ఉన్నాయని స్పష్టం చేశారు. 6 లేటరైట్ లీజుల్లో 5 పనిచేయడం లేదన్నారు. ఒక లీజు గడువు ముగిసిందన్నారు. 2 లీజుల్లో పనులు నిలిచిపోయాయని ద్వివేది పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక లీజులో 5వేల టన్నులకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. మిగతా వాటికి 2018 లో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం 2019లో అనుమతి పునరుద్దరణ చేశామన్నారు. భవాని, లోగరాజులు అక్రమంగా తవ్వకాలు చేసారని 19 కోట్ల జరిమానా విధించామని గనులశాఖ కార్యదర్శి ద్వివేది పేర్కొన్నారు.

Tags:    

Similar News