TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త

TTD: పున:ప్రారంభమైన వెంకన్న సర్వదర్శనాలు

Update: 2021-09-08 01:55 GMT

తిరుమల దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. ఉదయం ఆరు గంటలకే సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది టీటీడీ. కాగా.. రోజుకు 2వేల సర్వదర్శనం టోకెన్లను మాత్రమే జారీ చేయనున్నట్లు వెల్లడించింది. తిరుపతి శ్రీనివాసం కాంప్లెక్స్‌లోని కౌంటర్లలో టోకెన్లు జారీ చేసింది టీటీడీ. అయితే... ముందుగా చిత్తూరు జిల్లా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పించింది.

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి తిరుమలలో సర్వదర్శన టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. కేవలం ప్రత్యేక ప్రవేశ దర్శనం అన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న భక్తులు, సిఫార్సు లేఖల ద్వారా వచ్చే భక్తులను పరిమిత సంఖ్యలో ఇప్పటివరకు స్వామివారి దర్శనానికి అనుమతించారు. ఈ విషయంలో పలు విమర్శలు వెల్లువెత్తడంతో కోవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ చిత్తూరు జిల్లా భక్తులు మాత్రమే సర్వదర్శనం చేసుకునేందుకు వీలుగా టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News