Ration Cards: కొత్త రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకున్నవారికి గుడ్ న్యూస్..వచ్చే నెల నుంచి
Ration Cards: కొత్త రేషన్ కార్డులకు అప్లయ్ చేసుకున్నవారికి గుడ్ న్యూస్..వచ్చే నెల నుంచి
Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారికి శుభవార్త అని చెప్పవచ్చు. ఏపీలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అర్హత కలిగిన వారికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీలో భాగంగానే ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ కూడా జరుగుతోంది.
ఈనె 15వ తేదీ వరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 21వేలకు పైగా రేషన్ కార్డుకు సంబంధించిన దరఖాస్తులు వచ్చాయి. జనాలు చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారని అర్థమవుతోంది. అనంతపురం జిల్లాలో 11వేలకు పైగా రేషన్ కార్డులు అప్లికేషన్స్ వచ్చాయి. శ్రీసత్యసాయి జిల్లాలో అయితే దాదాపు 10వేల వరకు రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు దరఖాస్తులను ఆన్ లైన్ లో ఎంట్రీ చేస్తున్నారు.
అయితే ప్రభుత్వం జూన్ నెలలో స్మార్ట్ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని పేర్కొంటోంది. అంటే కొత్తగా రేషన్ కార్డు కోసం లేదంటే ఇతర రేషన్ కార్డుల సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు లభిస్తాయి. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు మాత్రమే కాదు ఇంకా చాలా మంచి చిరునామా మార్పు, సభ్యులను చేర్చడం, సభ్యుల తొలగింపు, విభజన కార్డుకు కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. అందులో ప్రధానంగా రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చడంలో ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.
గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి అవసరమైన పత్రాలను అందించాలి. అక్కడ ఉన్న డిజిటల్ సహాయకులు వివరాలను నమోదు చేస్తారు. వీఆర్వో లాగిక్ ఈ పత్రాలు వెళ్తాయి. ప్రతి వ్యక్తికి ఈకేవైసీ నిర్వహిస్తారు. తర్వాత తహసీల్దార్ లాగిన్ అప్లికేషన్స్ పంపిస్తారు. తహసీల్దార్ ఒకే చేస్తే అర్హులైన వారికి రేషన్ కార్డు నెంబర్ వివరాలు మొబైల్ కు వస్తాయి. ఈవిధంగా ప్రాసెస్ జరుగుతుంది.