AP Pensions: రాష్ట్రంలో 93వేల మందికి గుడ్ న్యూస్ వినిపించిన ప్రభుత్వం.. వారందరికీ కొత్తగా పింఛన్లు

Update: 2025-03-23 01:11 GMT

Pension: గుడ్ న్యూస్.. కొత్తగా 71వేల మందికి పింఛన్లు.. నెలకు ఎంత ఇవ్వనున్నారో తెలుసా?

AP Pensions: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా 93వేల పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు తీపికబురు అందించింది. 93 వేల మంది వితంతువులకు మే నుంచి కొత్తగా పింఛన్లను ఇవ్వనున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడలో శనివారంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో దాదాపు 5లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని తెలిపారు. వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు.

ఉపాధి కల్పన, మహిళల స్వయం సాధికారత, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలాన్ని ఓ యూనిట్ గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ ను రూపొందిస్తున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మండలానికి ఒక మహిళా భవనం నిర్మించి , దాన్ని శిక్షణకేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పేదరిక నిర్మూలనకు నిరుపేద కుటుంబాలను దాతలకు అప్పగించి వారి ద్వారా మెరుగైన జీవన విధానం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. 

Tags:    

Similar News