Srisailam: శ్రీశైల మల్లన్న భక్తులకు శుభవార్త.. తెల్లరేషన్ కార్డు దారులకు..

Srisailam: తెల్లరేషన్ కార్డు దారులకు ఉచిత సామూహిక సేవ పాల్గొనే అవకాశం

Update: 2023-04-21 07:17 GMT

Srisailam: శ్రీశైల మల్లన్న భక్తులకు శుభవార్త..

Srisailam: శ్రీశైలం మల్లన్నభక్తులకు దేవస్థానం శుభవార్త చెప్పింది. తెల్లరేషన్ కార్డులు కలిగిన భక్తులకోసం నెలలో ఒకరోజు ఉచిత సామూహికసేవలను నూతనంగా ప్రవేశపెట్టింది. .ఈసేవలను దేవస్థానం ఉచితంగా మొదటిసారి నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్నతెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన భక్తుల సౌకర్యార్థం ఈ సదుపాయంకల్పించామన్నారు. కాగా ఈనెల 25 వతేదీన ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకుని సామూహిక అభిషేకాన్నిచంద్రవతి కల్యాణమండపంలో నిర్వహిస్తున్నారు .

ఈ ఉచిత సామూహికసేవలో పాల్గొనదలచిన భక్తులు శ్రీశైల దేవస్థానం వెబ్ సైట్‌లో నమోదుచేసుకోవలన్నారు. అయితే ఈనెల 19 నుంచి భక్తులకు టికెట్స్ అందుబాటులో ఉంచుతామన్నారు ప్రతీమాసములో భక్తులకు 250 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.ఈ సేవ లోదంపతుల లేదా ఒకరు పాల్గొనవచ్చు. ఈసేవలో పాల్గొన్నభక్తులకు 2 లడ్డుప్రసాదాలు, కుంకుమ, విభూతి, అందించనున్నారు. దర్శనానంతరం దేవస్థానం నందు భోజనసదుపాయం కల్పించబడుతుందని ఈ ఉచిత సేవలన్ని భక్తులు వినియోగించుకోవాలని ఈవో తెలిపారు.

Tags:    

Similar News