Tirupati: ఆలస్యమవుతున్న బంగారు తాపడం పనులు

Tirupati: తిరుమలలో ఆనంద నిలయానికి బంగారు తాపడం చేయించాలని గతంలో టీటీడీ బోర్డు నిర్ణయం

Update: 2022-05-20 05:30 GMT

Tirupati: ఆలస్యమవుతున్న బంగారు తాపడం పనులు

Tirupati: మహా పుణ్య క్షేత్రమైన తిరుమలలో వెంకటేశ్వర స్వామి కొలువైవున్న ఆనంద నిలయానికి స్వర్ణతాపడం చేయించాలని టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. మూడంతస్తుల బంగారు విమాన గోపురానికి తాపడం చేయడమంటే మామూలు విషయం కాదు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో, వేల సంవత్సవాల వైఖానస ఆగమ శాస్త్రాలతో ముడిపడిన అతి సున్నీతమైన ఆంశం. దీంతో ఏ విధమైన పొరపాట్లకు తావులేకుండా తాపడం పనులు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అయితే నిర్ణయం ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇంకా పనుల్లో మాత్రం పురోగతి లేదు.

తిరుమలలోని శ్రీ వరహాస్వామి ఆలయానికి గతేడాది డిసెంబరులో స్వర్ణ తాపడం పనులు నిర్వహించారు. గోవిందరాజ స్వామి ఆలయంలోని విమాన గోపురానికి రాగి తాపడం పనులు కొనసాగుతున్నాయి. ఈ రెండు ఆలయాల్లో కూడా బాలాలయం ఏర్పాటు చేసి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి ఆలయ విమాన గోపురం కళ తగ్గడం, మహాద్వారం వద్ద భక్తులు చేతులతో తాకడంతో మహాద్వారాలు కళాహీనంగా మారాయి. శ్రీవారి సన్నిధిలోని బంగారు వాకిలి.. మరమ్మతులకు గురవ్వడంతో వాటిని మరమ్మతులు చేసేందుకు టీటీడీ పూనుకుంది. కానీ తిరుమలలో ప్రస్తుత పరిస్థితుల్లో బాలాలయం ఏర్పాటు చేయడమంటే సాధారణ విషయం కాదు. దాదాపు నెలల పాటు దర్శ నాలు నిలిపివేస్తే కానీ స్వర్ణతాపడం పనులు ముందుకు సాగవు. ఈ నేపథ్యంలో టీటీడీ అత్యాధునిక సాంకేతికత ద్వారా క్రేన్ల సాయంతో బంగారు తాపడం పనులు చేపట్టాలని భావిస్తుంది.

క్రేన్ల ద్వారా నిలిచి ఉన్న చోటు నుండి ఆలయ గోపురంపై కాలు పెట్టకుండా పనులు చేయవచ్చా అనే అంశంపై టీటీడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వర్ణ తాపడం పనులు బాలాలయం ఏర్పాటు చేయకుండా నిర్వహించడంపై టీటీడీ ఆగమ సలహాదారుల సూచనలు తీసుకుంటున్నారు. దీనిపై ఆలయ ఆర్చకులు, ఆగమ, వేద పండితుల సలహాలను పూర్తిస్థాయిలో తీసుకుని సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే పనులు ప్రారంభించేందుకు టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. స్వర్ణతాపడం పనులకు అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే టీటీడీ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. శ్రీ వారి సన్నిధిలోని బంగారు వాకిలికి అయ్యే ఖర్చును టీటీడీ తమిళనాడు స్థానిక సలహా మండలి అధ్యక్షుడు శేఖర్ రెడ్డి 3కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆలయ మహాద్వారం, బంగారు వాకిలి పనులను వీలైనంత త్వరగా ప్రారంభించనున్నారు. ఆగమ సలహాలను తీసుకుని శ్రీవారి విమాన గోపురానికి స్వర్ణ తాపడం పనులు ఏవిధంగా చేపట్టాలని త్వరలోనే నిర్ణయించి పనులను ప్రారంభించనుంది టీటీడీ.

Tags:    

Similar News