యూనియన్ బ్యాంకులో బంగారం మాయం
Union Bank: పల్నాడు జిల్లా రెంటపాళ్ల యూనియన్ బ్యాంకు బ్రాంచిలో బంగారం మాయమైంది. దీంతో ఖాతాదారులు బ్యాంకును ముట్టడించారు. గోల్ మాల్ అయిన బంగారం కోటి రూపాయలు విలువ చేస్తుంది. బ్రాంచి మేనేజర్, అస్టింటెంట్ మేనేజర్, అప్రయిజర్ బంగారాన్ని గోల్ మాల్ చేశారు. బంగారాన్ని ఎక్కడ దాచారో తెలియడం లేదు. కోటి 70 కోట్ల రూపాయల చేసే బంగారం మాయమైంది. మేనేజర్ రాంబాబు, అస్టింటెంట్ మేనేజర్ రవికుమార్, అప్రయిజర్ సంపత్ కూమార్‌లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. వ్యవసాయ పెట్టుబడి కోసం రైతులు బంగారం తాకట్టు పెట్టారు. దీంతో బ్యాంకు ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు.