విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దుర్గామాత మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

Update: 2025-10-01 05:01 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ దర్శనం

బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దుర్గామాత మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుష్టుడైన మహిషాసురిడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్ధిని అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం ఉండదని భక్తుల విశ్వాసం. మహిషాసుర వర్ధిని అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణలకు సంకేతంగా నిలుస్తుంది.

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో పదవ రోజు దుర్గమ్మ మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.. దుష్టుడైన మహిషాసరుడిని అంతమొందించిన భీకర శక్తి స్వరూపిణి మహిషాసుర మర్థని. ఎనిమిది భుజములు.. అష్ట ఆయుధాలు... సింహవాహినిగా.. రౌద్ర రూపంలో వున్న అమ్మవారిని దర్శించుకుంటే.. శత్రు భయం వుండదని భక్తుల విశ్వాసం. మహిషుడిని అంతం చేయడం ద్వారా లోకాలను అమ్మవారు కాపాడినట్లే... భక్తుల మనస్సులోని సకల దుర్గుణాలను అమ్మవారు హరించి వేస్తుందని అమ్మవారి విశిష్టతను పురాణాలు చెబుతున్నాయి. అజ్ఞానంమీద విజ్ఞానం, బాధల మీద   విజయం పొందే తత్వమే ఈ అమ్మరూపం. ముదురు నీలం రంగు వస్త్రాలు ధరించి అమ్మ మహిషాసుర మర్దనిగా మనకు దర్శనమిస్తుంది.

=========

నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్దిని అవతారం విశిష్టత విశేషంగా పరిగణించబడుతుంది. మహిషాసుర మర్దిని రూపం అతి ప్రధానమైనది. ఈ అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణలకు సంకేతంగా నిలుస్తుంది.

పురాణ కథనం ప్రకారం మహిషాసురుడు అనే అసురుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అమోఘ శక్తులు పొందాడు. దేవతలు, ఋషులు, మానవులను దౌర్జన్యాలకు గురి చేస్తూ లోకాన్ని కలవరపరిచాడు. ఆ సమయంలో దేవతల సమిష్టి శక్తి నుంచి వెలిసిన దుర్గామాతే మహిషాసుర మర్దిని. సింహ వాహనంతో విరాజిల్లుతూ, అష్టదశ భుజాలతో ఆయుధాలను ధరించి, ఆమె మహిషాసురుని వధించి ధర్మాన్ని స్థాపించారు.

దేవాలయాల్లో ఈ అవతారాన్ని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను నవరాత్రుల్లో మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శించడం గొప్ప అనుభూతి. ఈ రూపం భక్తులకు దుశ్శక్తులపై పోరాడే ధైర్యాన్ని, సత్ప్రవర్తనలో నిలకడను ప్రసాదిస్తుందని నమ్మకం.

పండితులు చెబుతున్నట్లుగా, మహిషాసుర మర్దిని రూపం కేవలం పురాణ గాథగాక, సమాజానికి ఒక ప్రేరణ. ఏ విధమైన అన్యాయం ఎదురైనా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని సమూలంగా తుడిచిపెట్టే శక్తి ప్రతి మనిషిలోనూ ఉందని ఈ అవతారం గుర్తు చేస్తుంది.

నవరాత్రి సందర్భంలో ఈ అవతారాన్ని దర్శించుకోవడం వల్ల శత్రువుల నుంచి రక్షణ, ధైర్యసాహసాలు, కుటుంబంలో ఐక్యత కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.

Tags:    

Similar News