Pulasa Fish: భవిష్యత్తులో ఇక పులస చేప దొరకదా? ఒక్కో చేప రూ. లక్ష అవ్వనుందా?
Pulasa Fish: ఈ సీజన్‌లో పులసకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పులస మార్కెట్లోకి ఇంకా రాకముందే వేల రూపాయలు అడ్బాన్సులు ఇచ్చి ముందే బుక్ చేసుకుంటారు.
Pulasa Fish: ఈ సీజన్‌లో పులసకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పులస మార్కెట్లోకి ఇంకా రాకముందే వేల రూపాయలు అడ్బాన్సులు ఇచ్చి ముందే బుక్ చేసుకుంటారు. అయితే ఈ పులస చేపలు భవిష్యత్తులో చాలా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వేల రూపాయల్లో పలుకుతున్న చేప భవిష్యత్తులో లక్షలు అయ్యే ఛాన్స్ ఉంది. అయితే దానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడు వలలో పులస పడుతుందా? అని జాలర్లు ఎదురుచూస్తే.. ఎప్పుడు దానిని కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలా? అని ఎంతోమంది ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో ఎదురుచూస్తున్నారు. పుస్తులమ్మైనా పులస కొనాలి.. చచ్చేముందు ఒక్కసారైనా పులస కూర తినాలి. అన్నమాదిరిగానే పులసకు క్రేజ్ ఉంటుంది. అయితే గతంలో దొరికినట్లు పులసు ఎక్కువగా ఇప్పుడు దొరకడం లేదని, భవిష్యత్తులో ఇవి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉందని కొంతమంది జాలర్లు అంటున్నారు.
ఒకరింట్లో పులస కూర వండితే.. ఆ రోజు ఆ ఊరంతా అదే టాపిక్. అంత క్రేజ్ పులస కూరకు. ఎంతోమంది ఇప్పటికే వేల రూపాయలు అడ్వాన్సులగా ఇచ్చి పులసలను బుక్ చేసుకున్నారు. ఇలా ముందుగా బుక్ చేసుకున్నవారిలో బడా వ్యాపారులు, రాజకీయ నేత్తల అనుచరులు ఎక్కువగా ఉన్నారు. 5వేలు, 10 వేలు, 20వేల రూపాయల డబ్బులు ముందుగానే జాల్లర్లకు ఇచ్చి, పులస పడగానే తమకు ఇవ్వమని చెప్పారు.
వర్షాకాలంలో మరీ ముఖ్యంగా జులై నెలలో వరదల కారణంగా గోదావరిలోకి మురుకు నీరు ఎక్కువగా చేరుతుంది. ఈ నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఈ సమయంలో అప్పటివరకు సముద్రంలో పుట్టి, పెరిగిన చేప గోదావరిలోకి ఎదురీదుతూ వస్తుంది. ఈ ఇలా కొంత దూరం ప్రయాణించిన తర్వాత వాటిని జాలర్లు వలవేసి పట్టుకుంటారు. సగం సముద్రంలో పెరగడం, సగం సమయం గోదావరిలో పెరగడం వల్ల ఈ పులసకు రుచి వస్తుందని అంటారు.
ప్రతి సంవత్సరం జులై నుంచి ఆగష్టు నెల మధ్యలో పులసలు జాలర్లకు చిక్కుతాయి. అయితే ఇంకా ఇప్పుడు జాలర్లకు ఎక్కువగా పులసలు పడలేదు. దీంతో చాలామంది జాలర్లకు అడ్వాన్సులు ఇచ్చి ముందుగా బుక్ చేసుకుంటున్నారు. అయితే జాలర్లు ఇవి రాను రాను తగ్గిపోతున్నాయని.. గతంలో ఈ సమయానికి చాలా పులసలు పడేవని చెబుతున్నారు. మహాసముద్రం నుంచి తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి బంగాళాఖాతంలోకి ఈ పులసలు చేరతాయి. అక్కడ నుంచి గోదావరి నదిలోకి ప్రవేశిస్తాయి. అయితే కొన్నాళ్లుగా ఈ పులసలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని జాలర్లు చెబుతున్నాయి. సముద్రంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా వాటి గమ్యాన్ని మరోవైపుకు మార్చుకుని ఉండి ఉండవచ్చని కూడా జాలర్లు చెబుతున్నారు. దీని బట్టి చూస్తే పులసను కొనాలంటే వేలు కాదు ఇక లక్షల్లో దాని ఖరీదు ఉండొచ్చని భావిస్తున్నారు.