Global Tech Summit: నేడు, రేపు విశాఖలో గ్లోబల్ టెక్ సదస్సు..!
Visakhapatnam: ఇవాళ, రేపు విశాఖలో గ్లోబల్ టెక్ సదస్సు జరగనుంది.
Global Tech Summit: నేడు, రేపు విశాఖలో గ్లోబల్ టెక్ సదస్సు..
Visakhapatnam: ఇవాళ, రేపు విశాఖలో గ్లోబల్ టెక్ సదస్సు జరగనుంది. జీ 20 దేశాల నుండి 20 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. యూరప్ దేశాల నుండి డేలిగేట్స్ హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్‌గా సదస్సులో పాల్గొననున్నారు. తొలిరోజు సదస్సులో భారత్ డిజిటల్ కాన్సెప్ట్‌పై, ఫార్మా రంగంలో ప్రజలకు సులభంగా, తక్కువ ధరకు మందులు లభించడానికి, ఫార్మా ఎడ్యుకేషన్ రంగంలో టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుందనే అంశాలపై చర్చ జరుగుతుందని పల్సస్ కంపెనీ సీఈవో, సమ్మిట్ కో కన్వీనర్ గేదెల శ్రీనుబాబు తెలిపారు. ఈ సదస్సులో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, విడదల రజిని, సీదిరి అప్పలరాజు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొంటారని పేర్కొన్నారు.