Gitam University: గీతం యూనివర్సిటీ అక్రమ కట్టడాల కూల్చివేతపై హైకోర్ట్ స్టే!

Geetham University: గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై హైకోర్టు స్టే ఇచ్చింది.

Update: 2020-10-26 02:53 GMT

గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని కొంత భూమి ప్రభుత్వానికి చెందినదంటూ.. దాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున 2 గంటల నుంచే భారీగా పోలీసులను మోహరించి.. పొక్లెయిన్‌లతో కూల్చివేత చేపట్టారు. ఈ విషయం తెలిసిందే. ఈ కూల్చివేతలపై గీతం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో గీతం విశ్వవిద్యాలయం కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే విధించింది. నవంబర్‌ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది.

గీతం యూనివర్సిటీలో అక్రమ కట్టడాలను కూల్చివేయడమే కాకుండా ఆ వెంటనే నిర్ణయించిన హద్దుల వరకూ ఫెన్సింగ్‌ వేశారు. ఈ క్రమంలో కొన్ని నిర్మాణాలతో పాటు గీతం వర్సిటీ ప్రధానద్వారం, సెక్యూరిటీ గదులు, మైదానం చుట్టూ ప్రహరీ తొలగించారు. ఏసీపీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వందమందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్డీవో పెంచలకిశోర్‌ ఆధ్వర్యంలో సుమారు 40 మంది రెవెన్యూ సిబ్బంది ఈ కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేత పనులు చేపట్టారంటూ గీతం యాజమాన్యం ఆరోపించింది. ఈ నేపథ్యంలో నవంబర్‌ 30 వరకు తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే విధించింది. 

Tags:    

Similar News