త్వరలో గంటా టీడీపీని వీడతారా?

విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి..

Update: 2020-10-01 10:42 GMT

విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాసరావు త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా ఆయన అధిష్టానం వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారన్న చర్చ నడుస్తోంది. సెప్టెంబర్ 27న ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించింది టీడీపీ. ఈ క్రమంలో విశాఖ , అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాలకు అధ్యక్షులను ఎంపిక చేసేందుకు గాని, జిల్లా ఇంచార్జ్ లను నియమించేందుకు గాని చంద్రబాబు నిర్వహించిన సమావేశానికి గంటా శ్రీనివాసరావు హాజరు కాలేదు. దాంతో ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారన్న విషయం అర్ధమవుతుంది.

మరోవైపు అధికార వైసీపీలో చేరాలని దాదాపు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే సీనియర్ నేతలైన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాసరావు.. గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే గంటా మాత్రం తన ప్రయత్నాలు ఆపడంలేదు. ముఖ్యమంత్రి జగన్ కు క్లోజ్ గా ఉంటారన్న వారితో సంప్రదింపులు జరుపుతున్నారన్న రూమర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో అన్నీ కుదిరితే అతి త్వరలోనే ఆయన టీడీపీని వీడతారన్న చర్చ విశాఖ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఇదిలావుంటే ఇటీవల విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News