Yarlagadda Venkata Rao: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. ఇవాళ చంద్రబాబుతో భేటీ
Yarlagadda Venkata Rao: ఇవాళ చంద్రబాబుతో భేటీ... గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని ప్రతిపాదన
Yarlagadda Venkata Rao: వైసీపీకి యార్లగడ్డ వెంకట్రావు గుడ్‌బై.. ఇవాళ చంద్రబాబుతో భేటీ
Yarlagadda Venkata Rao: కృష్ణాజిల్లా గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ కాన్నున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంపార్టీలో చేరేందుకు యార్లగడ్డ నిర్ణయించుకోవడంతో ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశంపార్టీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారు మారిన నేపథ్యంలో యార్లగడ్డ వెంకట్రావు అక్కడ ఇమడలేక, టీడీపీలో చేరుతున్నారు. చంద్రబాబునాయుడుతో భేటీకి ఇవాళ ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంనుంచి తెలుగుదేశంపార్టీ తరఫున పోటీచేసే అవకాశం కల్పించమని యార్లగడ్డ ప్రతిపాదించబోతున్నారని సమాచారం.