Tirumala: తిరుమలలో నేడు టైం స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత.. నేరుగా క్యూలైన్ లోకి అనుమతి

Update: 2025-01-22 00:19 GMT

TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

 Tirumala: తిరుమల శ్రీవారి సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇవ్వకుండా..డైరెక్టుగా క్యూలైన్లోకి అనుమతి ఇస్తున్నారు. ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే వైకుంఠద్వారా దర్శనం కల్పిస్తారు.

దూరప్రాంతాల నుంచి వచ్చిన సామాన్యులకు అప్పట్లో స్వామివారి దర్శనం లభించకపోవడంతో వారు ప్రస్తుతం పెద్దెత్తున తిరుమలకు చేరుకుంటున్నారు. రద్దీ తగ్గేంత వరకు సర్వదర్శనం భక్తులకు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి అనుమతి ఇస్తున్నారు. ఈ నెల 23న గురువారం తెల్లవారుజామున నుంచి ఏ రోజుకారోజు సర్వదర్శనం టోకెన్ల పంపిణీ పున ప్రారంభించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు గతంలోనూ టోకెన్లు లేకుండా అనుమతించడంపై టీటీడీ ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులు మంగళవారం సమావేశం అయ్యారు.

ఇటీవల తిరుపతిలో తొక్కిసలాట జరిగి 6 మరణించడం, దీనిపై చంద్రబాబు పరిశీలించి పలు సూచనలు చేసిన సంగతి తెలిసిందే. తిరుపతిలో టోకెన్లు ఇవ్వకుండా తిరుమలలో నేరుగా స్వామివారి దర్శనానికి అనుమతించడంపై పరిశీలించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించారు. నేరుగా సర్వదర్శనానికి అనుమతి ఇస్తే ఎదురయ్యే ఇబ్బందులు, ప్రయోజనాలపై ఉన్నతాధికారులు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దీనిపై టీటీడీ ఎలాంటి నిర్ణయాన్నీ ప్రకటించలేదు.

Tags:    

Similar News