Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..?
Free Bus: అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశం
Ap News: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..?
Free Bus: ఏపీలో ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్నా అప్పుడే ఎలక్షన్ హీట్ స్టార్ట్ అయ్యింది. ఇందులో భాగంగానే ప్రజలను ఆకట్టుకునేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ తమ మేనిఫెస్టోలపై కసరత్తు స్టార్ట్ చేశాయి. సామాన్యులకు చేరువయ్యేందుకు తమదైన శైలిలో వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త పథకాలు తీసుకొచ్చే యోచనలో ఉన్నారు సీఎం జగన్. తెలంగాణ, కర్నాటక తరహాలోనే ఏపీలో కూడా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. తెలంగాణలో ఇప్పుడిదే ట్రెండింగ్. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రధాన హామీలో ఒకటి. అయితే అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే ఈ పథకాన్ని పట్టాలెక్కించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా కంటిన్యూ అవుతోంది. అయితే కర్ణాటక ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను గెలిపించిన స్కీమ్‌లలో ఇది ఒకటి.
ఏపీలో ఎలాగైనా అధికారంలోకి రావాలనే టార్గెట్‌తో టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే నారా లోకేశ్ చేపట్టిన యువగళ విజయోత్సవ సభలో తమ మేనిఫెస్టోను ప్రకటించారు. అందులో మెయిన్‌గా ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ బస్ జర్నీ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. దీంతో.. అలర్ట్ అయిన సీఎం జగన్.. ఒక అడుగు ముందుకేసి ఎన్నికల వరకు ఆగకుండా... ఆ లోపే ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఏపీలోనూ ఫ్రీ బస్ స్కీమ్‌ను స్టార్ట్ చేయాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు ఇందుకు సంబంధించిన నివేదికను సైతం రూపొందిస్తున్నట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ ను ప్రారంభించనున్నారు. జగన్ ఆదేశాలతో తెలంగాణ అధికారులతో APSRTC అధికారులు చర్చలు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇందుకు ఎంత ఖర్చు అవుతోంది? తదితర వివరాలను APSRTC అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు నివేదికలు సిద్ధం చేస్తున్న ఆర్టీసీ అధికారులు త్వరలోనే ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే న్యూ ఇయర్ లేదా సంక్రాంతి కానుకగా ఈ స్కీమ్ ను స్టార్ట్ చేయాలన్న లక్ష్యంతో సీఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏపీలో అమలుకు రంగం సిద్దమవుతోంది. ఈ పథకం అమలు పైన ఆర్దిక భారం.. పొరుగు రాష్ట్రాల్లో ఎదురవుతున్న సమస్యలపైన ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. వరుస సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎన్నికల్లోకి వెళ్తున్న అధికార వైసీపీ ఈ నిర్ణయం పైన ఆచితూచి అడుగులు వేస్తోంది. మహిళలకు ఈ పథకం అమలు చేస్తూనే..ఇతర వర్గాలకు అసౌకర్యం లేకుండా విధి విధానాలు ఖరారు చేస్తోంది.