YSR Law Nestam: వరుసగా నాలుగోసారి వైఎస్సార్ లా నేస్తం
YSR Law Nestam: నేడు బటన్ నొక్కి విడుదల చేయనున్న జగన్
YSR Law Nestam: వరుసగా నాలుగోసారి వైఎస్సార్ లా నేస్తం
YSR Law Nestam: వైఎస్సార్ లా నేస్తం పథకం కింద రాష్ట్రంలో అర్హులైన 2వేల 11మంది జూనియర్ న్యాయవాదులకు కోటి రూపాయల మొత్తాన్ని బుధవారం విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో సొమ్ము జమ చేయనున్నారు. పట్టభద్రులైన యువ న్యాయవాదులకు లా నేస్తం ద్వారా మూడేళ్ల పాటు నెలకు 5వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. విడుదల చేసే మొత్తంతో కలిపి మూడున్నరేళ్లలో 4వేల 248మందికి 35కోట్ల 40 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందించింది. న్యాయవాదుల సంక్షేమం కోసం వంద కోట్ల కార్పస్ ఫండ్‌తో అడ్వొకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి కోవిడ్ సమయంలో న్యాయవాదుల అత్యవసరాలకు అందులో నుంచి 25కోట్లను సాయంగా విడుదల చేశారు. యువ న్యాయవాదులు ఏకకాలంలో పెద్ద మొత్తం అందుకునేలా ఇక నుంచి ప్రతి ఆరు నెలలకోసారి బటన్ నొక్కి లబ్ధి కలిగించేలా మార్పులు చేస్తున్నారు.