Polavaram: పోలవరం ప్రాజెక్ట్‎పై 4 రాష్ట్రాల అధికారుల సమావేశం

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల భద్రాచలానికి ముప్పు లేదు: కేంద్రం

Update: 2022-09-29 13:00 GMT

Polavaram: పోలవరం ప్రాజెక్ట్‎పై 4 రాష్ట్రాల అధికారుల సమావేశం

Polavaram: పోలవరం ప్రాజెక్ట్‎పై 4 రాష్ట్రాల అధికారుల సమావేశం ముగిసింది. వర్చువల్ విధానంలో జరిగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల భద్రాచలంకు ముప్పు, కరకట్ట నిర్మాణం, నష్టాల పై రీసర్వే వంటి పలు ప్రధాన అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల భద్రాచలంకు ఎలాంటి ముప్పు దేన్నకేంద్రం.. పోలవరం బ్యాక్ వాటర్ పై ఇప్పటికే 2009, 2011 లో శాస్త్రీయమైన సర్వేలు, అధ్యయనం చేసామని స్పష్టం చేసింది.

మరోసారి సర్వే చేయించాలన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన కేంద్రం.. ముంపు పై ఒడిస్సా, తెలంగాణ , చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు అపోహలు అవసంర లేదని తేల్చి చేప్పింది. ముంపులేకుండా కరకట్ట కట్టేందుకు ఏపి ప్రభుత్వం ముందుకు వచ్చిందని గుర్తుచేస్తూ స్పష్టం చేసింది. 36లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వెళ్లేలా ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందన్న కేంద్రం.. అక్టోబర్ 7న 4 రాష్ట్రాల ఈఎన్సీలతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. 

Tags:    

Similar News