CID Enquiry: సీఐడీ విచారణకు హాజరైన దేవినేని

Update: 2021-04-29 08:16 GMT

దేవినేని ఉమా (ఫైల్ ఇమేజ్)

CID Enquiry: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటల మార్ఫింగ్ కేసులో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సీఐడీ విచారణకు హాజరయ్యారు. సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి, దుష్ర్పచారం చేశారనే ఆరోపిస్తూ వైసీపీ నేత ఎన్.నారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ధారంగా దేవినేని పై పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని ఉమ విచారణకు హాజరుకావడంతో సీఐడీ కార్యాలయం వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, వారిచ్చిన ఆదేశాల మేరకు విచారణకు హాజరయ్యానని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ మాటలను మార్ఫింగ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. మరోవైపు, ఈ కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు సీఐడీ విచారణకు హాజరు కావాలని ఉమను ఆదేశించింది. ఇదే సమయంలో ఆయనను అరెస్ట్ చేయకూడదని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News