Andhra Pradesh: కర్నూలు జిల్లా నంద్యాల గాంధీ చౌక్‌లో టీడీపీ నిరసన
*అసెంబ్లీలో వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఫైర్ *టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. ఇరువురి మధ్య వాగ్వాదం
కర్నూలు జిల్లా నంద్యాల గాంధీ చౌక్‌లో టీడీపీ నిరసన(ఫోటో- ది హన్స్ ఇండియా)
Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై అధికార పార్టీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీమంత్రి ఫరూక్, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా తమ నేతపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలు జిల్లా నంద్యాల గాంధీ చౌక్‌లో సీఎంతో పాటు, వైసీపీ ఎమ్మెల్యేల చిత్రపటాలను తగలబెట్టే యత్నం చేశారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు.