చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు..

విజయవాడలోని కరకట్టకు వదర పోటెత్తింది. ఉండవల్లి కరకట్ట దగ్గర వరద పెరగడంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరింది. చంద్రబాబు నివాసంలోని వాక్ వే పూర్తిగా మునిగిపోయింది.

Update: 2019-08-16 06:10 GMT

విజయవాడలోని కరకట్టకు వదర పోటెత్తింది. ఉండవల్లి కరకట్ట దగ్గర వరద పెరగడంతో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరద నీరు వచ్చి చేరింది. చంద్రబాబు నివాసంలోని వాక్ వే పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో రివర్ వ్యూ భవనం సగానికి పైనా నీరు చేరింది. దీంతో సిబ్బంది అక్కడ స్టోన్ క్రషర్ డస్ట్ ఇసుకతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు.కరకట్ట వెంబడి ఉన్న అన్ని నిర్మాణాల్లోకి వరద నీరు రావడంతో.. ఆందోళన వ్యక్తం అవుతోంది. వరద ఉద్ధృతి ఇదే విధంగా కొనసాగితే, చంద్రబాబు ఇంట్లోకి సైతం నీరు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన గుంటూరు కలెక్టర్, రెవెన్యూ అధికారులతో చర్చించారు.

ఇక ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ లో నీటి మట్టం 15 అడుగులు దాటింది. దీంతో ప్రాజెక్ట్ గేట్లపై నుంచి వరద నీరు దూకుతోంది. ఇన్‌ ఫ్లో, ఔట్‌ ఫ్లో ఆరున్నర లక్షల క్యూసెక్కులకు పైగా ఉంది. ఇటు ఇబ్రహీంపట్నం పుష్కర ఘాట్ లోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అర్ధరాత్రి రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానదికి వరద రావడంతో.. లంక గ్రామాల్లోకి మరోసారి వరద నీరు వస్తోంది. ఇప్పటికే కృష్ణ లంక, రామలింగేశ్వర్ నగర్‌లోని పలు కాలనీల్లోకి వరదనీరు వచ్చింది. దీంతో స్థానికులు మళ్లీ భయాందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు. అలాగే పాఠశాలలకు సెలవు ప్రకటించారు. 

Full View

Tags:    

Similar News