Alluri District: విహార యాత్రలో విషాదం.. జలపాతం వద్ద ఐదుగురు విద్యార్థులు గల్లంతు
Alluri District: అల్లూరి జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం వద్ద ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.
Alluri District
Alluri District: అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విహార యాత్రలో విషాదం చోటుచేసుకుంది. జలతరంగిణి జలపాతం వద్ద ఐదుగురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. ఒక్కసారిగా వాగు ఉధృతంగా రావడంతో విద్యార్థుల గల్లంతు అయ్యారు. గల్లంతైన వారిలో నలుగురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలను స్థానికులు రక్షించారు. వారిని ఆస్పత్రికి తరలించారు. మిగతా ముగ్గురు అమ్మాయిలు, ఓ అబ్బాయి కోసం గాలింపు కొనసాగుతోంది. విహారయాత్రకు మొత్తం 13 మంది విద్యార్థులు వచ్చారు. ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీ విద్యార్థులుగా గుర్తించారు.