Nandyala: పెద్ద మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. సుమారు రూ.25 లక్షల నష్టం

Nandyala:

Update: 2023-08-05 12:12 GMT

Nandyala: పెద్ద మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. సుమారు రూ.25 లక్షల నష్టం

Nandyala: నంద్యాల పెద్ద మార్కెట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్‌లో ఫ్రూట్స్ నిల్వ చేసే భారీ షెడ్ల పక్కనే ఉన్న రెండు దుకాణాలు, రెండుకార్లు, ఒక ఆటో , 10తోపుడు బండ్లు దగ్ధం అయ్యాయి. పండ్లు, మొక్కజొన్న కంకులు మంటలకు ఆహుతి అయ్యాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదంతో సుమారు 25లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద విషయం తెలిసి ఎమ్మెల్యే కిషోర్‌రెడ్డి ఘటనా స్థలికి వచ్చారు. బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా... లేక కావాలని ఎవరైనా నిప్పు పెట్టారా అన్న కోణంలో అధికారులు విచారిస్తున్నారు.

Tags:    

Similar News