రెండు వర్గాలుగా విడిపోయిన రాజధాని ప్రాంత రైతులు

Update: 2019-11-26 02:36 GMT

అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు రెండు వర్గాలుగా ఏర్పడినట్టు తెలుస్తోంది. 28న ప్రతిపక్షనేత చంద్రబాబు రాజధాని రావడంపై కొందరు రైతులు ఆగ్రహంగా ఉన్నారు. క్షమాపణలు చెప్పాకే రాజధాని ప్రాంతంలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. గ్రాఫిక్ లు చూపించి తమని నట్టేటా ముంచారని ఓ వర్గం భావిస్తుంటే.. మరో వర్గం రైతులు చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తున్నారు.

ఏపీ భవిష్యత్ పై విశ్వాసంతో తాము భూములు ఇచ్చామని, ఇప్పుడు రాజధానిని ఎటూ కాకుండా చేయడం వల్ల ఆందోళనలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. భూముల రేట్లు సైతం 30 నుంచి 50 శాతం పడిపోతున్నాయని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు తమ గోడు వెళ్లబోసుకుంటామని చెబుతున్నారు. 

Tags:    

Similar News