Masks to Buffaloes: కరోనా భయం.. రైతు ఆలోచనకి హాట్సాఫ్!

Masks to Buffaloes: ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ జిల్లాల నుంచి వస్తున్న కేసులతో రోజుకు రాష్ట్రంలో

Update: 2020-07-24 08:45 GMT
Masks to buffaloes

Masks to buffaloes : ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. వివిధ జిల్లాల నుంచి వస్తున్న కేసులతో రోజుకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో జనాలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అయితే ఈ కరోనాని అడ్డుకోవాలంటే మాస్క్ తప్పనిసరి అని వైద్యులు వెల్లడిస్తున్నారు. మాస్క్, సామజీక దూరం పాటిస్తేనే కరోనా నుంచి బయటపడతామని చెబుతున్నారు. ఇక పలు చోటల్లో మాస్క్ ధరించని వారిపైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

అయితే మనుషుల పరిస్థితి ఇలా ఉంది. ఇక మూగజీవుల పరిస్థితి ఏంటి అని అలోచోంచిన కొందరు వినూత్నంగా చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు మండలం పందలపర్రు గ్రామానికి చెందిన అన్నవరం అనే రైతు కరోనా భయంతో తనకి జీవనాధారం అయిన గేదెలు కరోనాబారిన పడకూడదనే ఉద్దేశంతో గేదెలకు మాస్కులని కట్టాడు. గడ్డి మేసేటప్పుడు, కుడితి, నీళ్లు తాగేటప్పుడు మాత్రమే మాస్కు తొలగిస్తున్నాడు. ఆ రైతును చూసి మిగతా రైతులు కూడా ఇదే పద్ధతిని అవలంభిస్తున్నారు.

ఇక అటు ఏపీలో కూడా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గురువారం నాటికీ ఉన్న సమాచారం మేరకు రాష్ట్రంలో గత 24 గంటల్లో 58052 సాంపిల్స్‌ ని పరీక్షించగా 7,998 మంది కోవిడ్‌19 పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. కొత్తగా 5, 428 మంది కోవిడ్‌ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 72,711 పాజిటివ్ కేసు లకు గాను.. 2895 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారుండగా.. 884 మంది మరణించారు. ప్రస్తుతం కేసులతో కలిపి రాష్ట్రంలో 34,272 యాక్టివే కేసులు ఉన్నాయ్. ఇక కరోనాతో పోరాడి రాష్ట్రంలో ఇప్పటివరకు 37,555 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

Tags:    

Similar News