అమరావతిలో ఉద్రిక్తత.. రైతు కాలుపై నుంచి వైసీపీ ఎంపీ కాన్వాయ్ కారు

అమరావతిలో అపశృతి చోటుచేసుకొంది. అమరావతిలోని అమరలింగేశ్వరుని మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ కాన్వాయ్ వాహనం రైతు కాలుపైకి దూసుకెళ్లింది.

Update: 2020-02-23 13:14 GMT
అమరావతి

అమరావతిలో అపశృతి చోటుచేసుకొంది. అమరావతిలోని అమరలింగేశ్వరుని మొక్కులు చెల్లించేందుకు వెళ్లిన బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ కాన్వాయ్ వాహనం రైతు కాలుపైకి దూసుకెళ్లింది. ఆదివారం సాయంత్రం అమరలింగేశ్వర స్వామి రథోత్సవం ఉండటంతో మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆలయానికి వెళ్లారు. వారితో పాటు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వెళ్లారు.

అక్కడ రోడ్డు పక్కన రైతులు నిలుచుని ఉన్నారు. ఎంపీ నందిగం సురేశ్ వాహనం ఆ సమయంలో అటుగా వెళ్లింది. కారు రైతులను తగులుకుంటూ వెళ్లింది. అక్కడే ఉన్న తుళ్లూరు రైతు హనుమంతరావు కాళ్లపై నుంచి వెళ్లింది. ఆయన కుడికాలు చిటికిన వేలికిగాయం కావడంతో అక్కడే ఉన్న తోటి రైతులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘనట జరిగిన కారు ఆపకుండా వెళ్లిపోయారని రైతులు మండిపడ్డారు.

రథోత్సవం సందర్భంగా వైసీపీ నేతలంతా అక్కడకు వెళ‌్లడంతో, తుళ్లూరు నుంచి రైతులు, మహిళలు కూడా అక్కడకు వెళ్లారు. ఆలయం వద్ద మంత్రి మోపిదేవి, ఎమ్మె్ల్యే అంబటి కూడా అక్కడే ఉన్నారు. రైతులు భారీగా అక్కడకు చెరుకున్నారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయేమో అనుమానంతో ఆలయానికి కొద్ది దూరంలో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో వాహనాలు నిలిపి రైతులను ఉండటంతో నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పారు. దీంతో వారు ర్యాలీగా ఆలయంవైపుగా కదిలారు. ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఎంపీ కాన్వాయ్ వాహనం అటూగా వెళ్లింది. దీంతో కారు పక్కకు తప్పించబోయి రైతు కాలుపైకి ఎక్కింది. అయితే అనంతరం రైతు పరిస్థితిపై ఎంపీ ఆరా తీసినట్లు సమాచారం.

Full View


Tags:    

Similar News