మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడదల రజిని
Vidadala Rajini: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మానవత్వం చాటుకున్నారు.
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి విడుదల రజిని
Vidadala Rajini: ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మానవత్వం చాటుకున్నారు. నాగార్జున యూనివర్సిటీ వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో విజయవాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ రివ్యూలో పాల్గొనేందుకు సెక్రెటేరియట్‌కు వెళ్తున్న మంత్రి రజిని ప్రమాద ఘటనను చూసి చలించిపోయారు. 108 వాహనం వచ్చే వరకు అక్కడే ఉండి బాధితులకు ధైర్యం చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో బాధితులను గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు.