Anil Kumar: అనిల్ ఆత్మీయ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
Anil Kumar: ఈ నెల 27న సీఎంతో భేటీకానున్న అనిల్‌కుమార్ యాదవ్
Anil Kumar: అనిల్ ఆత్మీయ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ
Anil Kumar: కాసేపట్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఆత్మీయ సమావేశం జరగనుంది. ఇటీవల సీఎం జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి అనిల్‌కుమార్ హాజరుకాలేదు. ఆయన స్వల్పఅనారోగ్యంతో చెన్నైలో ఉన్నారు. జిల్లాలో జరిగిన పార్టీ అనుబంధ సంఘాల పదవుల నియామకంపై అనిల్‌కుమార్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అతని అనుచరుల చర్చించుకుంటున్నారు. గత 15రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. దీంతో కాసేపట్లో అనిల్‌కుమార్ నిర్వహించే ఆత్మీయ సమావేశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 27న సీఎం జగన్‌తో అనిల్‌కుమార్ యాదవ్ భేటీకానున్నారు.