ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం

Update: 2019-12-16 13:46 GMT

ఏపీ ఎక్సైజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఎవరైనా మద్యం అక్రమాలకు పాల్పడితే నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేయడంతోపాటు ఆరు నెలలు జైలుశిక్ష, రెండు లక్షల రూపాయలు జరిమానా విధించేలా చట్టంలో మార్పులు చేశారు. ఒకవేళ రెండోసారి తప్పుచేస్తే 5లక్షల రూపాయల ఫైన్ విధించేలా చట్టాన్ని తీసుకొచ్చినట్లు సీఎం జగన్ తెలిపారు. ఇక, బార్లు అక్రమాలకు పాల్పడితే రెట్టింపు లైసెన్సు ఫీజు వసూలు చేస్తామని, మళ్లీమళ్లీ తప్పుచేస్తే మొత్తం బార్ లైసెన్సునే రద్దు చేస్తామని సీఎం జగన్ వివరించారు.

Tags:    

Similar News