Tirumala: శేషాచల కొండల్లో గుప్తనిధుల వేట.. పోలీసులకే దిమ్మతిరిగే షాక్..

Tirumala: సినిమా లైన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా స్కెచ్ వేశారు.

Update: 2021-05-18 03:15 GMT

Tirumala: శేషాచల కొండల్లో గుప్తనిధుల వేట..

Tirumala: సినిమా లైన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా స్కెచ్ వేశారు. పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లారు. ఎవరికి అనుమానం రాకుండా ఏడాది కాలంగా తవ్వకాలు జరిపారు. ఇంకా కొన్ని రోజులు తవ్వితే ధనవంతులు కావొచ్చనే ఆశ వారిలో చిగురించింది. అందుకోసం పనులు వేగవంతం చేశారు. కానీ, ఏం జరిగిందో ఏమో కానీ, అంతలోనే ప్లాన్ బెడిసికొట్టింది. రాత్రికి రాత్రే ధనవంతులు కావచ్చనే వారి స్కెచ్ పోలీసులకు తెలిసింది. అంతే ఇంకేముంది వారి సొరంగ తవ్వకాలను పోలీసులు బయటపెట్టారు. పోలీసులకు చిక్కారు. ఇది తిరుమల శేషాచల కొండల్లో వెలుగులోకి వచ్చింది.

సాధారణంగా గుప్తనిధుల కోసం గడ్డి గుర్తులతో అన్వేషణ చేస్తుంటారు. కానీ, ఇక్కడ పక్కా స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది. ఎవరో ఏదో లెక్కలేసి పక్కాగా గీత గీసినట్టు తవ్వకాలను బట్టి తెలుస్తోంది. వారి తవ్వకాలు సినిమాల్లోని సీన్‌లాగే కనిపించాయి. నెలల తరబడి జరుగుతున్న ఈ వ్యవహారంపై నిఘా పెట్టిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

తిరుమల శేషాచలం అడవుల్లో ఒక కొండపై త్రిశూల ఆకారంలో తవ్వకాలు జరిపితే భారీగా గుప్త నిధులు దొరుకుతాయని మంకునాయుడు అనే వ్యక్తికి ఒక స్వామిజీ చెప్పాడు. దాంతో మంకునాయుడు మరో ఆరుగురితో కలిసి స్వామిజీ చెప్పిన ఆనవాళ్లతో పని మొదలు పెట్టారు. భారీ టెన్నల్‌ను తలపించేలా కొండలను తొవ్వరు. దాదాపు 80 అడుగుల సొరంగం తవ్వి ఉండటాన్ని చూసిన పోలీసులకు దిమ్మతిరిగింది. ఏడాది కాలంగా రహస్యంగా ఈ సొరంగాన్ని తవ్వుతున్నట్టు గుర్తించారు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు, అటవీ అధికారులు, టీటీడీ విజిలెన్స్ కన్నుగప్పి ఇంతటి భారీ సొరంగం ఎలా తవ్వారన్న అంశంపై ఇప్పుడు తిరుమల కొండల్లో సంచలనంగా మారింది.



Tags:    

Similar News